Drugs | రాయపోల్, సెప్టెంబర్ 20: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలపై నివారణ కోసం మండలం కేంద్రంలోని టీ షాపులు, పాన్‌షాపులు, కిరాణాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయపోల్ ఎస్సై మానస మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అనుమానస్పద ప్రదేశాల్లో డ్రగ్స్, గంజాయి కోసం తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు ఎవరైనా కలిగి ఉన్న, అక్రమంగా రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ నార్కొటిక్ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా రాయపోల్ పోలీసులకు సమచారం అందించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు.