రాయపోల్ జనవరి 14 : నిరుపేదలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని పాల రామా గౌడ్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన తోడేంగుల కిషన్ చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులు ఇప్పటికి శాశ్వతం కాదని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి పేదలకు పలు రకాల సేవలను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తాము సంపాదించిన డబ్బులో కొంత పేద ప్రజలకు అందించి వారి రుణం తీర్చుకోవడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తాను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల మధ్యన ఉంటున్నామని, పేదలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో
మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్నం యాదగిరి, జనార్దన్ రెడ్డి, బిక్షపతి, మహేష్, నర్సింలు, మురళి, తదితరులు పాల్గొన్నారు.