SI Manasa | రాయపోల్, నవంబర్ 04 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే యజమానులకు, ఆపరేటర్లకు సిటీ పోలీస్ యాక్ట్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, వివాహ ఊరేగింపు లేదా ఇతర కార్యక్రమాల సమయంలో డీజే ఉపయోగించాలంటే తప్పక అనుమతి తీసుకోవాలని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు.
మంగళవారం ఎస్ఐ మానస మాట్లాడుతూ.. రాత్రి 10 గంటల తర్వాత డీజే ఉపయోగానికి అనుమతి ఇవ్వం. పర్మిషన్ లేకుండా లేదా సమయం దాటి డీజే ఉపయోగించినట్లయితే, డీజే పరికరాలు, వాహనాలు సీజ్ చేయబడతాయని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారన్నారు. డీజే యజమానులు, ఆపరేటర్లు పోలీసుల సహకారంతో మాత్రమే డీజే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజే, హై సౌండ్ పరికరాల వినియోగం నిషేధమని.. పరిమిత ప్రాంతాలలో అనుమతి మేరకు తక్కువ శబ్ధంతో డీజే ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. రాయపోల్ ప్రాంతంలో పర్మిషన్ లేకుండా డీజే ఉపయోగించకుండా.. సుప్రీంకోర్టు ఆదేశాలు, నగర పాలన చట్టాలు, పోలీసు సమన్వయంతో ఈ నియమాలు పాటించాలని కఠినంగా హెచ్చరించారు.
డీజే యజమానులు, ఆపరేటర్లు విధివిధానాలు, సమయ పరిమితులు పాటించి, అనుమతి తీసుకుంటేనే డీజే ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుండానే ఉపయోగించినట్టైతే ఇలాంటి పరికరాలు సీజ్ చేయబడతాయని.. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో