Mission Bhageeratha water | రాయపోల్, జూలై 14 : రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. గ్రామంలో పంచాయతీ బోరు మోటర్ కాలిపోవడం, మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో మంచినీటి కోసం మహిళలు. గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో గత రెండు నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు మంచినీళ్లు రావడం లేదని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మంచి నీళ్లు రాక బోరు బావుల వద్ద నుంచి ఆటోలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి నెలకొందని గ్రామస్తులు పేర్కొన్నారు. గత పది సంవత్సరాల నుంచి తమకు మంచినీళ్ల బాధ లేకుండేదని ప్రస్తుతం మిషన్ భగీరథ మంచి నీళ్లు రెండు నెలలుగా రాకపోవడంతో తమ సమస్యను ఎవరు పరిష్కరించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఎస్సీ కాలనీలో బోర్ ఉండగా అది కాలిపోయి రోజు తరబడి ఉన్నప్పటికీ పట్టించుకునేవారు కరువైపోయారని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
పడకేసిన పారిశుధ్యం..
లింగారెడ్డి పల్లి గ్రామంలో పారిశుధ్యం పడకేసింది. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు దోమలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పంచాయతీ చెత్త టాక్టర్ తీరగడం లేదని దీంతో గ్రామంలో ఎక్కడ వేసిన చెత్తాచెదారం అక్కడే ఉండిపోతుందని పేర్కొంటున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తే ట్రాక్టర్ డీజిల్ పైసలు కూడా రావడంలేదని. ఇప్పటికే తమ చేతి నుండి లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పర్యటించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని