Cotton Cultivation | రాయపోల్, ఆగస్టు 04 : పత్తి పంట సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని చిన్నమాసాన్ పల్లి గ్రామ పరిధిలోని ప్రత్తి పంటను సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చి పురుగుల ఆశించే అవకాశం ఉందని.. అందువల్ల పత్తి పంట వేసిన రైతులు వీటి నివారణ కోసం అసిటామిప్రిడ్ 20% SP 100 గ్రాములు ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 400 మి.లీ ఎకరానికి, థయోమిథాక్జామ్ 25%WG 100 గ్రాములు ఎకరానికి, వేప నూనె 1000 మి.లీ ఎకరానికి కలిపి పిచికారి చేసి పత్తిలోని తెల్ల దోమ , పచ్చ దోమ, పెనుబంక లాంటి రసం పీల్చే పరుగులు నివారించి మంచి ఫలితం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
అదే విధంగా నానో యూరియా ప్లస్ గురించి రైతులకు వివరించటం జరిగింది. నానో యూరియా ప్లస్ పిచికారి చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితుల నుండి పంటలను కాపాడుకోవచ్చునని.. అదే విధంగా పంటలకు కావలసిన నత్రజని కూడా మొక్కలకు లభిస్తుందని రైతులకు వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, రైతులు పాల్గొన్నారు.
Kollapur | ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
Veerabhadram | దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి : తమ్మినేని వీరభద్రం
Juluruapadu : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి