Crop Cultivation | రాయపోల్, సెప్టెంబర్ 23 : ఈ వానా కాలం-2025 సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ల ప్రకారం పత్తి పంట ఈ నెల 25 లోపు, అదే విధంగా మొక్కజొన్న పంట 31లోపు ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామoలో ప్రత్తి పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాల వలన పండు ఆకులు వేసి ఎర్రబడే అవకాశం ఉంది. అందువల్ల పత్తి పంటను సాగు చేసే రైతులు 13-0-45 ఒక ఎకరానికి ఒక కేజీ+ఫార్ములా 4 ఒక కేజీ ఎకరానికి కలిపి పిచికారి అలా చేసినట్లయితే పంట ఏపుగా పెరుగడమే కాకుండా పచ్చగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి