న్యూఢిల్లీ: ఢిల్లీలో 22 ఏళ్ల ఓ వ్యక్తి తన బైక్‌తో ప్రమాదకర స్టంట్స్(Biker Stunts) పర్ఫార్మ్ చేశాడు. మోటార్‌సైకిల్‌పై వెళ్తూ ప్రయాణికుల్ని వేధిస్తున్నాడు. సోషల్ మీడియా రీల్స్ కోసం అతను ఆ డేంజరస్ స్టంట్స్ చేశాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై రైడ్ చేస్తూ.. ఆటోలు, కార్లు, బస్సులకు చెందిన డోర్లను తీస్తున్నాడు. కదిలే వాహనాలకు చెందిన డోర్లను తీస్తున్న కేసులో నిందితుడు తుషార్ పునియాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఖాజూరీ ఖాస్ నివాసితుడిగా అతన్ని గుర్తించారు.
అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఓ బైక్ స్టంట్‌కు చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఢిల్లీ ఆర్టీసీకి చెందిన బస్సు డోరును బైక్‌పై వెళ్తూ లాగేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. వైరల్ రీల్ ఆధారంగా న్యూ ఉస్మాన్‌పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తుపట్టి, పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా బైకర్ వైరల్ వీడియో ప్రదేశాన్ని పరీక్షించారు. ఆ తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
స్టంట్స్ కోసం వాడిన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టంట్స్ పర్ఫార్మ్ చేస్తున్న సమయంలో గుర్తు పట్టకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్ తీసివేసినట్లు పోలీసులు చెప్పారు.
🔶 सड़क नियमों को ताक पर रखने वालों के खिलाफ कार्रवाई।
🔸 वायरल वीडियो पर संज्ञान लेते हुए थाना न्यू उस्मानपुर ने न्याय संहिता की धारा 281 और MV एक्ट के तहत स्टंटबाजों के खिलाफ कसा सिकंजा। #DPUpdates#ViralVideo pic.twitter.com/FociYbmmve
— Delhi Police (@DelhiPolice) February 17, 2026