Revenue Village Profile | కొండపాక (కుకునూరుపల్లి), జూన్ 17 : భూ యాజమాన్య వివరాలతో రెవెన్యూ విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చిందన్నారు. భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అదే విధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదవారి పేరు మీద భూ హక్కుల బదిలీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు దరఖాస్తులను ఆన్లైన్లో భద్రంగా ఉంచుతామన్నారు.
రెవెన్యూ సదస్సులో రైతులు పెట్టుకున్న ప్రతీఅర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క దరఖాస్తు కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. గ్రామంలో రైతులు, వ్యవసాయ భూమి, ప్రభుత్వ భూమి, తదితర భూమి పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ శ్యామ్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా