HPV vaccination | అర్హులైన బాలికలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి : ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
HPV vaccination,| బాలకల ఆరోగ్య రక్షణలో భాగంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా ఎంతో ముఖ్యమైనదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు.
HPV vaccination | నర్సాపూర్, మార్చి 12: అర్హులైన బాలికలకు వారి తల్లిదండ్రులు హెచ్పీవీ టీకాలు వేయించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి బాలికలకు టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ టీకాలు వేయించాలని తెలిపారు. బాలికల ఆరోగ్యం కోసం ఎంతో అవసరమైన హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వైద్య శాఖను అభినందించారు. బాలకల ఆరోగ్య రక్షణలో భాగంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా ఎంతో ముఖ్యమైనదని వెల్లడించారు. హెచ్పీవీ అనే వైరస్ వల్ల గర్భాశయ సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ టీకా వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ సెర్వికల్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ హెచ్పీవీ టీకా సురక్షితమైనదని, ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు సూచిస్తున్న సమర్ధవంతమైన రక్షణాత్మక టీకాలలో ఒకటని పేర్కొన్నారు.
బాలికల ఆరోగ్య భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాచునూరి లక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సృజన, నర్సాపూర్ ఏరియా దావాఖాన సూపరింటెండెంట్ డా.పావని, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


Read Also :
Odisha | మద్యం మత్తులో దారుణం.. కుటుంబ కలహాలతో భార్య, కోడలు, మనవరాలి హత్య
Jasveer Singh | ముందుగా రూ.28 లక్షలకు ఒకే చెప్పిన టెకీ.. ఆపై రూ.36 లక్షలిస్తేనే చేరుతానని మెలిక..!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

