గజ్వేల్, మే 22: ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి అక్కడి నుండి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం ధర్మారెడ్డిపల్లి, మూట్రాజ్‌పల్లి రింగ్‌రోడ్డుపై తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మహిళ రైతులతో మాట్లాడి కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల్లోగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అక్కడ నుండి తరలించని పక్షంలో రాజీవ్ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని, కొనుగోలు చేయడంతో ప్రభుత్వం విఫలమయిందన్నారు. రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక చేతులెత్తేశారని, ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫమయిందని విమర్శించారు.
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కాళేళ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తే అది జీర్ణించుకొలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షకట్టి అవినీతి మచ్చ వేస్తు నోటీసులు పంపడం సిగ్గుచేటన్నారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ప్రజలక్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
రైతులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో సాగు విస్తీర్ణం పెంచాలనే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కేసీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో ఆ పార్టీ నేతలను ప్రజలే చీపుర్లతో నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జెజాల వెంకటేశంగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గుంటుకు రాజు, నర్సింగరావు, కనకయ్య, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.