మిరుదొడ్డి, మే 4 : అమ్మవారి దయ వల్ల గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ప్రతిష్టస్తున్న బొడ్రాయి అమ్మవారి ఉత్సవాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు సామూహింకంగా జరుపుకుంటున్న బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలతో జీవనం గడిపే విధంగా అమ్మవారు దీవేనలు అందించాలని ప్రార్థించారు.
పంటలకు సాగునీరు అందించాలి
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణాలు చేపట్టిన కాలువ నిర్మాణ పనులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం చెప్యాల గ్రామంలో అసంపూర్తిగా మిగిలిన మల్లన్న సాగర్ కాలువలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. అక్కడి నుంచే ఇరిగేషన్ అధికారులు, సదరు కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకుపంట పొలాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవిత , మిరుదొడ్డి మాజీ ఎంపీపీ కవిత, ఏఎంసీ మాజీ చైర్మన్లు బాపురెడ్డి, సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు రాజమహేందర్ రెడ్డి, నర్సింహులు, సురేందర్, చెప్యాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.