సిద్దిపేట అర్బన్, మే 11 : బీరప్ప దేవుని దీవెనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను ఆగం చేస్తున్న ప్రభుత్వం కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక రాష్ట్ర ప్రజలను ఆగం చేస్తుందన్నారు.
గత ప్రభుత్వంలోనే సిద్దిపేట రైలు కల నెరవేర్చామని, మందపల్లి గ్రామం వద్ద డీఎక్స్ఎన్ కంపెనీ తెచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించామన్నారు. పదేండ్లలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపామన్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, సభ్యులు హరీశ్‌రావును సత్కరించారు.