చిన్నకోడూర్, జులై 18 : ఇటీవల బిఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కొండంత భరోసా ఇచ్చారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలోని బాధిత కుటుంబాన్రని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కొన్ని నెలల క్రితం విష్ణుమూర్తి భార్య రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇటీవల విష్ణుమూర్తి మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారడం ఎంతో బాధాకరమని అన్నారు.
విష్ణుమూర్తి పిల్లలను అన్ని విధాల ఆదుకుంటానని కొండంత భరోసానిచ్చారు. అదేవిధంగా ఇ్రబహీంనగర్లో సోషల్ మీడియా కన్వీనర్ తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్య్రకమంలో బీఆర్ఎష్ట్రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పండ్యాల లింగారెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు గుండెల్లి వేణు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.