Mission Bhageeratha | మిరుదొడ్డి, జూలై 2 : అసలే వాన కాలం.. ఈ కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు.. రోజూ తాగే మంచి నీరు కలుషితమవుతున్నా అధికారులకు ఇవేవి పట్టడం లేదు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 7వ వార్డు మెయిన్ రోడ్డు సమీపంలో గ్రామానికి మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ లీకై అక్కడి గుంతలో చెత్తా చెదారం పేరుకపోయి మురుగునీరుగా మారుతుంది.
ఇవాళ ఉదయం వేళలో గ్రామానికి తాగునీళ్లు వదిలిన సమయంలో మిషన్ భగీరథ పైపు ద్వారా తిరిగి మళ్లీ మంచి నీళ్లలో కలిసిన మురుగు నీరు ఇండ్లలోకి సరఫరా అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన కాలంలో ఇలాంటి మురుగు నీళ్లను తాము సేవిస్తే వ్యాధులు సంభవిస్తాయని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.
గ్రామ ప్రజల ఆర్యోగాలను కాపాడానికి రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి 7వ వార్డులో లీకవుతున్న మిషన్ భగీరథ మంచి నీళ్ల పైపు లైన్ను సరి చేసి మాకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచి నీటిని సరఫరా చేయాలని ధర్మారం గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యార్థులకు రుచికమైన భోజనం అందించాలి : గణేశ్ రామ్
మిరుదొడ్డి, జులై 2 : విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని పెడుతూ నాణ్యమైన విద్యను అందించాలని మిరుదొడ్డి మండల ప్రత్యేకాధికారి గణేశ్ రామ్ అన్నారు. బుధవారం చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులు ఆరగిస్తున్న భోజనాన్ని పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి లోపాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్ రెడ్డి, ఎంఈవో ప్రవీన్ బాబు, డాక్టర్ సమీనా సుల్తానా, ప్రిన్సిపాల్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య