Minister Ponnam Prabhakar | హుస్నాబాద్ టౌన్, మార్చి 30. ఈ కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని , సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకాంక్షించారు.
ఇవాళ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు శివాలయం వద్ద శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
అనంతరం పర్యావరణాన్ని కాపాడేందుకు స్థానిక టీ స్టాల్ యజమానులకు ఉచితంగా స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు తప్పనిసరిగా స్టీల్ గ్లాసులనే ఉపయోగించాలని మంత్రి పొన్నం హోటల్ యజమానులకు సూచించారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్