సిద్దిపేట, సెప్టెంబర్ 10 : భూమికోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma) అని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ముబారస్పూర్ రజక సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా ఐలమ్మ ఉద్యమించిందన్నారు.
విస్నూర్ దేశ్ముఖ్ గుండాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరఫున పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచిందన్నారు. దండెత్తిందని గుర్తుచేశారు. ఐలమ్మ అడుగుజాడల్లో మనమందరం నడువాల్సిన అవసరం ఉందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుప్పతి నరేష్ కురుమ, బీజేపీ నాయకులు కుమ్మరి స్వామి, రజక సంఘం అధ్యక్షులు నర్సింలు, రజక సంఘం కమిటీ సభ్యులు, వెంకటేష్, కుమార్, గణేష్, సురేష్, ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకుడు కొంగరి రాజు పాల్గొన్నారు