సిద్దిపేట, జూలై 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండగా, ఇప్పు డు మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఈనెల 3వ తేదీతో మండల, జిల్లా పరిషత్‌లకు పదవీకాలం ముగిసింది. దీంతో పల్లె నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ వరకు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లింది. స్థానిక సం స్థల్లో కీలకమైన పరిపాలనా పగ్గాలు అధికారుల చేతిలోకి వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు. ఈనెల ఈనెల 3న ఎంపీపీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యహరిస్తారు. శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది.
ఉమ్మడి జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1615 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. మండల పరిషత్‌లు 68, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 23 మండల పరిషత్‌లు, 499 గ్రామ పంచాయతీలు, మెదక్ జిల్లాలో 20 మండల పరిషత్‌లు, 469 గ్రామ పంచాయతీలు, సం గారెడ్డి జిల్లాలో 25 మండల పరిషత్‌లు, 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధ్దంగా లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలన ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. 20 14లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2019 జూలై రెండోసారి మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి నుంచి గ్రామా ల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలను ఇదివరకు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం వెనకడుగు వేసిం ది.
ఇప్పుడు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కులగణన చేపట్టేది ఎన్నడూ..అది పూర్తయ్యేదెన్నడూ…ఎన్నికలను నిర్వహించేది ఎప్పుడూ అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గాలు లేకపోతే గ్రామాలు, మం డలాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధు లు రావు. ఫలితంగా అభివృద్ధిలో వెనుకబడి పోతా యి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో నిధుల కటకట వేధిస్తున్నది. చిన్నచిన్న పనులకు నిధులు లేవు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేస్తున్నా రు. ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వడం లేదు. ప్రత్యేకాధికారులను నియమించిన నేపథ్యంలో మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.