Livestock Market Auction | హుస్నాబాద్ పశువుల అంగడి వేలం సోమవారం వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టీ మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో వేలం పాటను ప్రారంభించారు. వేలం పాటలో కోటి 26 లక్షల 27 వేల 373 రూపాయల నుంచి పాటను మున్సిపల్ సిబ్బంది ప్రారంభించారు. దాదాపు 40 నిమిషాల పాటు వేలం పాటను సిబ్బంది ప్రారంభించినా.. కాంట్రాక్టర్ ఎవరు పాట పాడేందుకు ముందుకు రాలేదు.
గతంలో కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ అంగడితో నష్టపోయాడని తక్షణమే అంగడి వేలం ధరను తగ్గించాలని అధికారులకు కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. వేలం పాట తగ్గిస్తే తప్ప తాము వేలంలో పాట పాడమని.. తమ విన్నపాన్ని మన్నించాలని వారు కమిషనర్‌ను కోరారు. వేలం పాటను ఎక్కడి నుండి ప్రారంభించాలనే విషయాన్ని గతంలో జరిగిన టెండర్ నుండి నిర్ణయించామని తగ్గించడం అనేది తమ చేతిలో లేదని ఈ విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళ్లి వేలంపాట నిర్వహిస్తామని కమిషనర్ వారికి తెలిపారు.
వేలం పాటను తగ్గించిన తర్వాతే అంగడి వేలం నిర్వహించాలని పలువురు కాంట్రాక్టర్లు కమిషనర్‌కు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని ఈ విషయాన్ని నివేదించి త్వరలోనే తిరిగి వేలంపాటకు ముందుకు వస్తామని ఇంకెవరైనా వేలం పాటలో పాల్గొనేందుకు ముందుకు వస్తే దరఖాస్తు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ మల్లికార్జున గౌడ్ తెలిపారు.
హుస్నాబాద్ చుట్టుపక్కల అంగళ్లు పెరగడంతో హుస్నాబాద్ అంగడి ఆదాయం తగ్గిందని అధికారులు సైతం ఆ విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అప్పటివరకు వేలంపాటను నిర్వహించద్దని కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కోరారు. కాంట్రాక్టర్ల సూచన మేరకు వేలంపాటను వాయిదా వేయడం జరిగిందని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామని వెల్లడించడం జరుగుతుందని కమిషనర్ మల్లికార్జున గౌడ్ విలేకరులకు తెలిపారు. కొత్తగా వేలం పాటలో పాల్గొనేందుకు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని గమనించాలని ఆయన వివరించారు.
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు