Livestock Auction | హుస్నాబాద్ పశువుల అంగడివేలం మళ్లీ వాయిదా పడింది. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో పశువుల అంగడివేలంను కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలం పాట కార్యక్రమం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దాదాపు 20 నిమిషాల వరకు కాంట్రాక్టర్లు ఎవరు వేలం పాట సమావేశానికి హాజరు కాలేదు.
కాంట్రాక్టర్ల కోసం అధికారులు వేచి చూస్తుండగా.. అంగడి వేలం ధరను ఎలా తగ్గించాలని దానిపై కాంట్రాక్టర్లు మంతనాలు జరుపుకుంటూ ఉండిపోయారు. దీంతో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వేలంపాటకు రావాలంటూ పదేపదే విజ్ఞప్తి చేయడంతో సమావేశానికి హాజరయ్యారు. వేలంపాట ధరను అధికారులు తిరిగి కోటి 26 లక్షల ఇరవై ఏడు వేల 300 రూపాయల ధరతో పాటను ప్రారంభించారు.
పలుమార్లు అధికారులు ఇదే వేలంపాట ధరను వినిపించడంతో కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపారు. ఇలా అయితే మేము వేలం పాటలో పాల్గొనమని బహిష్కరిస్తామంటూ వారు స్పష్టం చేశారు. వేలం ధర పాఠం తగ్గిస్తేనే తాము పాల్గొంటామంటూ కాంట్రాక్టర్లు కమిషనర్‌కు వివరించారు.
తాము ఉన్నతాధికారుల ఆదేశాలు నిబంధన ప్రకారమే వేలంపాటను నిర్వహిస్తామని ఇందులో వేలం ధరను తగ్గించే అధికారం తమకు లేదని కమిషనర్ కాంట్రాక్టర్లకు వివరించారు. ఇలా అయితే వేలం ధరలో పాట పాడమంటూ కాంట్రాక్టర్లు బహిష్కరిస్తామని కమిషనర్ కు మరో మారు స్పష్టం చేయడంతో మీ అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు.
అనంతరం తిరిగి వేలంపాటను చేపడతామని కమిషనర్ వారికి తెలిపారు. అనంతరం కమిషనర్ మల్లికార్జున గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. వేలంపాట వాయిదా విషయన్ని ఉన్నతాధికారులకు నివేదించి తనంతరం మరోమారు నిర్వహిస్తామని తెలిపారు. వేలంపాట మరోమారు వాయిదా పడడంతో అంగడి నిర్వహణ మున్సిపల్ అధికారులపై పడనుంది. అడిగే పారిశుధ్య పనులకు సిబ్బంది సరిపోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్న తరుణంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో వేలం పాట నిలిచిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
Thudarum | మోహన్ లాల్‌తో 56వ సినిమా చేస్తున్న శోభన.. ఇంట్రెస్టింగ్గా ‘తుడరుమ్’ ట్రైలర్
Prabhas| ప్రభాస్ పెళ్లిపై కొత్త రూమర్స్.. హైదరాబాద్ అల్లుడు కాబోతున్నాడా..!
Mangalavaaram 2 | మంగళవారం సీక్వెల్లో శ్రీలీల.?