Thudarum | మోహన్ లాల్‌తో 56వ సినిమా చేస్తున్న శోభన.. ఇంట్రెస్టింగ్గా ‘తుడరుమ్’ ట్రైలర్
Mohanlal | ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఇంకో సినిమాను కంప్లీట్ చేశాడు మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్.
Mohanlal | ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఇంకో సినిమాను కంప్లీట్ చేశాడు మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తుడరుమ్’ (Thudarum). ఈ సినిమాకు మలయాళ పాపులర్ డైరెక్టర్, ఆపరేషన్ జీవా ఫేం తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణలో ఎమ్ రెంజిత్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు మోహన్ లాల్, శోభన కాంబోలో 55 సినిమాలు రాగా.. ఇది 56వ చిత్రంగా రాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే మోహన్ లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండగా.. అతడి కారు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్య ఏంటి.. ఆ కారుని వదిలిపెట్టి మోహన్‌లాల్ ఒక్కక్షణం ఎందుకు ఉండలేడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్రైమ్ కామెడీగా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం పార్ట్ 2గా వస్తుంది. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

