
గజ్వేల్ రూరల్ : కొల్గూర్ను అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మంత్రి హరీశ్‌రావు దత్తతగ్రామం కొల్గూర్ను గడ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న రెవెన్యూ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతోపాటు ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
కొల్గూర్ను మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకున్న తరువాత గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నియోజవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ, సర్పంచ్ రాజు, ఎంపీటీసీ గొడుగు జ్యోతీస్వామి, తహసీల్దార్ అన్వర్, అధికారులు అజయ్, బాలప్రసాద్, నాగేంద్ర, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.