సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 10: రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులతో మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే నిర్మాణంలో భాగంగా చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాలు, నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, జకాపూర్ గ్రామాల్లో మొత్తం 25 ఎకరాల 30 గుంటల భూమిని ఇంకా రైల్వే నిర్మాణానికి సేకరించాల్సి ఉన్నందున ఆయా మండలాల తహసీల్దార్లు, సిద్దిపేట ఆర్డీవో ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జనార్దన్, సిద్దిపేట అర్బన్, నారాయణరావుపేట, చిన్నకోడూరు తాసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిషరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిషార మార్గం చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిషారం కోరుతూ జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి వస్తారని, అధికారులు శాఖలవారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిషారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిషరించాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిషరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగ రాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, తదితర అధికారులు పాల్గొన్నారు.