రాయపోల్ డిసెంబర్ 23 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అని ఉప సర్పంచ్ కుమ్మరి రాజు అన్నారు. నూతనంగా ఉప సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాయపోల్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల సాహాయ సహకారాలతో మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి గల్లి గల్లీలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మండల కేంద్ర అభివృద్ధి కోసం అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. తాను మండల కేంద్ర ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సహకారం కోసం తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు.