Kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 06: ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా మారి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు షాలువాతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తి, విశ్వాసంతో ఎల్లమ్మ తల్లిని మొక్కుకుంటే అమ్మవారి కృపతో కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ మహోత్సవాలను నిర్వహించిన గౌడ సంఘం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాయపోల్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, ఉపాధ్యక్షులు కర్నాల సత్యనారాయణ, ఇతర బీఆర్ఎస్ నాయకులు, గ్రామ గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.