తొగుట : అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుపాన్ మూలంగా మండలంలోని వెంకట్రావుపేటలో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అరుగాలం కష్టపడి పంట సాగుచేసిన రైతులకు పంట చేతికి వొచ్చిన సమయంలో వర్షాల మూలంగా తీరని నష్టం వాటిల్లిందన్నారు.
మండల వ్యాప్తంగా వర్షాల మూలంగా చేతికి వొచ్చిన పత్తి చెజారి పోతుందని, వరి, మొక్కజొన్న ధాన్యం తడిచి మొలుకెత్తుతున్నాయన్నారు. ఆలస్యంగా మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించడంతో రైతులకు నష్టం జరిగిందని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.