తొగుట : అకాల గాలి దుమారం మూలంగా పంట చేలు నెలకొరిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకటరావుపేటలో సోమవారం రాత్రి వడగాలి మూలంగా నష్టపోయిన గ్రామానికి చెందిన మక్కల శ్రీనివాస్ మొక్కజొన్న పంట చేలను పార్టీ శ్రేణులతో కలిసి అయన పరిశీలించారు. పెద్ద ఎత్తున గాలి వీయడంతో చేతికొచ్చిన మొక్కజొన్న చేలు నేలకు ఒరిగిందని, అలాగే మామిడి కాయలు నేలకు రాలడంతో తీవ్రంగా నష్టం జరిగిందన్నారు.
గత 15రోజుల క్రితం కూడా గాలి దుమారం మూలంగా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రుణమాఫీ అసంపూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి గౌడ్, పులిగారి శివయ్య, ఎర్రోల్ల చంద్రం, జహంగీర్, ఎంగలి నరేందర్, నర్సింహా రెడ్డి, సుతారి రాంబాబు, బెజ్జనమైన నవీన్ తదితరులున్నారు.