Talent Awards | సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 07 : షెడ్యూల్ కులాల విద్యార్థులను ఉన్నత చదువులు చదివించడమే లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పది, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
అందులో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రం అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు ఈ నెల 10 తేదీలోపు 9440494886 నంబర్లో సంప్రదించాలని కోరారు.
మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు సహకారంతో సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాములు,రామస్వామి, సత్యకృష్ణ, చంద్రం సత్యనారాయణలు పాల్గొన్నారు.