Priyanka Chopra | బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో నటిస్తూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతుందని తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఈ క్రేజీ భామకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అదేంటో మీకు ఇప్పటికే గుర్తొచ్చే ఉంటుంది.
అదేనండి ప్రియాంకా చోప్రా మరో తెలుగు హీరో సినిమాలో నటిస్తుందన్న వార్త. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ మూవీకి అల్లు అర్జున్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు చర్చ నడుస్తోంది.
కాగా ఇందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా కనిపించనుందంటూ నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. అట్లీ ఈ విషయమై ఇప్పటికే ప్రియాంకా చోప్రాతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తుండగా.. తాజాగా దీనిపై ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. బన్నీ నటిస్తున్న చిత్రం భారీ స్థాయిలో ఉండబోతుంది. ఈ మూవీ అప్డేట్ బయటకు వచ్చిన తర్వాత చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీటిలో ప్రియాంకా చోప్రా పేరు ప్రముఖంగా ఉంది. ఆమె ఈ సినిమాలో భాగం కావడం లేదు. ఈ వార్తలు పూర్తిగా పుకార్లు మాత్రమేనంటూ అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సన్నిహిత వర్గాలు ఓ ప్రకటనతో తెలిపాయి.
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి
Jaat Movie | ‘జాట్’ సెట్స్‌లో సన్నీ డియోల్‌ను కలిసిన ప్రభాస్
Ashu Reddy | తన బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన అషూ రెడ్డి.. ఆ కారణం వల్లే విడిపోయాం