Kim Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండేజ్ (Kim Fernandez) ఏప్రిల్ 06న కన్నుమూసింది. మార్చి 24న గుండెపోటు కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన కిమ్, ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 6, 2025 ఆదివారం నాడు తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన తర్వాత జాక్వెలిన్, ఆమె తండ్రి ఎల్రాయ్ ఫెర్నాండేజ్ ఆస్పత్రికి చేరుకున్నారు. జాక్వెలిన్ తల్లి మృతి పట్ల పలువురూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంకకు చెందిన నటి. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. మోడలింగ్ ద్వారా భారతదేశంలోకి అడుగుపెట్టి, ‘అలాద్దీన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ నూతన నటిగా ఐఫా అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత మర్డర్ 2. హౌస్‌ఫుల్ 2, రేస్ 2 చిత్రాలతో మరింత స్టార్డమ్ సంపాదించుకుంది. భాగీ 2, రాధే, సెల్ఫీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది. ప్రభాస్ నటించిన సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ అనే ఐటం సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హౌస్‌ఫుల్ 5తో పాటు వెల్కమ్ టు ద జంగిల్ తదితర చిత్రాల్లో నటిస్తుంది.