Ashu Reddy | జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఇప్పుడు తన అందచందాలతో కుర్రకారుని ఎంతగా అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్ ఇలా అన్ని విభాగాలలో సత్తా చాటుతుంది. ఇక బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. విదేశీ టూర్లు, వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో అల్లాడించేస్తుంటారు. అయితే ఈ అమ్మడు తాజాగా తన ప్రేమ, పెళ్లి,బ్రేకప్లకి సంబంధించి పలు విషయాలు మాట్లాడింది. తాను ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉందట. ఇద్దరికీ ఈగో ఇష్యూస్ వలన మా బంధం బ్రేకప్ అయిందని అంటుంది అషూ రెడ్డి.
ఇద్దరం కూడా ఎవరికి వాళ్లం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉండేవాళ్లం. తను జాబ్ చేసి సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను. అయితే నా విషయంలో అతని ప్రమేయం మరింత ఎక్కువైంది. ఒసారి ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్లినప్పుడు అతను కూడా వచ్చాడు. అక్కడ ఓ ఇష్యూ జరిగింది. ఆ రోజు వెళ్లకపోయిన బాగుండేది. ఆ తర్వాత బ్రేకప్ అయింది.డిప్రెషన్లోకి వెళ్లాను. డిప్రెషన్ నుంచి బయటపడటానికి కొంత మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అని తెలిపింది అషూ. ఇప్పుడు ఆ అబ్బాయి మళ్లీ వస్తే తాను యాక్సెప్ట్ చేయనని అంటుంది.
ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చాలా సార్లు హ్యాంగ్ ఔట్ అవుతానని అంటుంది అషూ రెడ్డి.ఒకసారి ఇద్దరం దుబాయ్‌లో హ్యాంగవుట్ అయ్యాం. అయితే నేను వేరుగా వెళ్లాను. ఆయన వేరే పని మీద వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు చేసి.. దుబాయ్‌లో ఉన్నావా అని మెసేజ్ చేశాడు. అవును అని చెప్పడంతో సాయంత్రం కలిసాడు. అప్పుడు రాహుల్‌తో నా రిలేషన్ ఏర్పడంది. రాహుల్ కుటుంబం నాకు ఫ్యామిలీ లాంటింది. మా కుటుంబంతో కూడా వారు చాలా బాగా ఉంటారు. మా బంధం విషయంలో రాహుల్ ఫ్యామిలీ త్వరలో ఓ ప్రకటన అధికారికంగా చేస్తారు. దానిని నేను రీ పోస్టు చేస్తాను. అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఏ విషయాలను వెల్లడించలేను అని అషురెడ్డి చెప్పడంతో త్వరలో రాహుల్, అషూ పెళ్లి చేసుకోబోతారేమో అని ముచ్చటించుకుంటున్నారు