Jaat Movie | గదర్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ నటుడు తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. జాట్(Jaat) అంటూ వస్తున్న ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. అయితే ఈ మూవీ టీమ్‌ని తాజాగా కలిశాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
A MASSIVE FRAME when #Bahubali met #Jaat 💥
Two icons of Action cinema 🔥Rebel Star #Prabhas with Action Superstar @iamsunnydeol & director @megopichand from the sets of #JAAT ❤🔥#JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th.#BaisakhiWithJaat
Produced by @MythriOfficial… pic.twitter.com/kYYZEtnDFz
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2025