Peddi Vs Paradise | టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకరిని మించి మరొకరు రూపొందిస్తున్నారు. అయితే వచ్చే శ్రీరామనవమికి టాలీవుడ్ నుండి రెండు బడా సినిమాలకి పోటీకి సిద్ధమవుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా వచ్చే సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలానే ప్యారడైజ్ సినిమా కూడా వచ్చే శ్రీరామనవమి 2026 మార్చ్ 26 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పీక్స్ లో ఉంటుందని ఇప్పటి నుండే చర్చలు జరుపుతున్నారు.
నేచురల్ స్టార్ నాని ఈ మధ్య ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా వెళ్తున్నారు. ఆయన సినిమాలలో రాను రాను వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. మొన్నొచ్చిన హిట్ 3 టీజర్ చూసాక.. వామ్మో అక్కడున్నది నానియేనా అని అందరికి అనుమానాలు వచ్చాయి. ప్యారడైజ్లోను నాని పాత్రని చూసి అందరు అవాక్కయ్యారు. నాని ఏంటి ఇంత వయోలెంట్‌గా మారాడని అందరు ముచ్చటించుకున్నారు. ఈ సినిమాతో నాని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పెద్దిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ అంతగా ఆడకపోవడంతో ఆ సినిమా తర్వాత వస్తున్న పెద్ది సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ మరోసారి తన నట విశ్వరూపం చూపించి అదరగొట్టాడు. అసలు బుచ్చిబాబు టేకింగ్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, రెహమాన్ బీజీఎం పెద్ది సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయింది. పాటలు కూడా రెడీ చేసేసారు. పెద్ది, ది ప్యారడైజ్ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు మాస్ సినిమాలు వచ్చే శ్రీరామనవమికి పోటీపడబోతున్నాయి. మరి ఈ పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.