సిద్దిపేట అర్బన్, జనవరి 12 : పూర్తి పారదర్శకంగా ప్రతి కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని సిద్దిపేట పోలీస్ క మిషనర్ ఎన్.శ్వేత అన్నారు. గురువారం సిద్దిపేట పోలీ స్ కమిషనరేట్ కార్యాలయంలో సిద్దిపేట, హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి ఏసీపీ, సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ 2021,2022 సంవత్సరాల్లో పరిశోధనలో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని.. పో క్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా రు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులను త్వరగా భాధితులకు ఇప్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని.. సైబర్ నేరాల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలని తెలిపారు. దొంగతనాల కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను ఛేధించాలని సూచించారు.
ప్రతిరోజు ఉద యం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జీలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ డాటాలో డాటా ఎంట్రీ ప్రతి రోజు మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, వర్టికల్ విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తరచూ శిక్షణా తరగతులు నిర్వహించి వారి పని తనాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారి టీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాల్లో, పట్టణాల్లో ఆయా గ్రామాల వీపీఓలు పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ తెలిపా రు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్, సీఐలు భిక్షప తి, రవికుమార్, భానుప్రకాశ్, కిరణ్, శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ రా మకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, ఎస్సైలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.