Indiramma Houses | రాయపోల్, ఆగస్టు 04 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి తొందరగా పూర్తి చేయాలని రాయపోల్ ఎంపీడీవో బాలయ్య అన్నారు. ఎంపీఓ శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాయపోల్ మండలం టెంకంపేట గ్రామపంచాయతీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే లక్ష రూపాయల బిల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పంచాయతీ కార్యదర్శి శశికుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Kollapur | ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
Veerabhadram | దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి : తమ్మినేని వీరభద్రం
Juluruapadu : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి