‘ముస్లింల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి’
రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్‌లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా..
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరకొరగా రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు
– జిల్లా ముస్లిం జనాభా 63,439
– మంజూరైన గిఫ్ట్ ప్యాక్‌లు కేవలం 4 వేలు మాత్రమే
– మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
రుద్రంపూర్, మార్చి 12 : రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అరకొరగా గిఫ్ట్ ప్యాక్‌లు ముంజూరు చేయడం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో 63,439 ముస్లిం జనాభా ఉండగా కేవలం 4 వేల మందికి మాత్రమే గిఫ్ట్ ప్యాకెట్లు మంజురైనట్లు వెల్లడించారు. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గంలో ముస్లిం జనాభా 28,679 మంది ఉండగా కేవలం 1,250 , ఇల్లెందులో 11,022 మంది ఉండగా 750, భద్రాచలంలో 3,807 మంది ఉండగా కేవలం 500, పినపాకలో 12,152 మంది ఉండగా 750, అశ్వారావుపేటలో 7,779 మంది ఉండగా 750 గిఫ్ట్ ప్యాక్ లు మంజూరవ్వడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 149 మసీదులు ఉండగా అందులో 16 మసీదులకు ఒక్కో మసీదు రూ.లక్ష చొప్పున, రూ.16 లక్షలు మాత్రమే ఇఫ్తార్ దావత్ లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని మిగతా మసీదు పరిధిలో గల పేద ముస్లింలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్ర ముస్లిం మైనారిటీల పక్షాన ఉంటామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం చేస్తుందే తప్పా ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని, ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరి ముస్లింల మద్య చిచ్చు పెట్టేలా ఉందని, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించి భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని యాకూబ్ పాషా కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
Panchayat Grading | పంచాయతీల్లో గ్రేడింగ్ గందరగోళం.. కార్యదర్శుల ప్రమోషన్లకు ఆటంకం!
Uttam Kumar Reddy | కార్యకర్తలకు న్యాయం జరుగలేదు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి
CM Press meet | ‘నమస్తే’, టీ న్యూస్‌ను పిలువొద్దు.. సీఎం ప్రెస్మీట్లపై సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

