Hymavathi | సిద్ధిపేట, జులై 03 : సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ జూనియర్, గురుకుల జూనియర్ కళాశాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చి అడ్మిషన్లు పెంచాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నుండి మంజూరైన నిధులను కళాశాలలకు పెయింటింగ్, టేబుల్స్, డ్యూయల్ డెస్క్, విండోస్ రిపేర్ చేయించాలని అధికారులకు తెలిపారు. ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సిన వాటికి ఎస్టిమేట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ ప్రాంతాల నుండి కళాశాలకు రావడానికి బస్ సౌకర్యం కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి కావాల్సిన రూట్లకు బస్ సౌకర్యం, కొన్ని కళాశాలలకు బస్ పరిధి పెంచేందుకు నోట్ తయారు చేసి ఆయా రీజనల్ మేనేజర్ లెటర్ పెట్టాలన్నారు. జూనియర్ కళాశాల, అన్ని హాస్టళ్లలో సౌకర్యాలు సమకూర్చి ఒక్క సీటు కూడా మిగలకుండా విద్యార్థులు చేరేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు విద్యార్థుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించాలని, గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్, కొన్ని కళాశాలల్లో రాత్రి వేళల్లో ఆకతాయిలు చేరి మద్యం తాగుతూ, కిటికీలు, డోర్, టాయిలెట్స్ ఇతరత్రా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని తెలుపగా.. సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పికెటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతలో రాజీపడవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిబిసీడీవో నాగరాజమ్మ, డిఎస్సిడిఓ కవిత, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్