సిద్దిపేట, మే 31 : సిద్దిపేట ఆధ్యాత్మికతను ఒడిసి పట్టిన నేల.. కళాకారులకు, గాయని గాయకులకు పెట్టింది పేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన శ్రీహరి పదార్చన శ్రీనివాసుడి కల్యాణ్సోవం కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో తిరుపతి దేవస్థాన ఉత్సవ వ్రిగహలతో కల్యాణం జరగడం సంతోషమన్నారు.
సిద్దిపేటకు విచ్చేసిన గాయని శోభా రాజు, ఆధ్యాత్మిక ప్రచారకులు భారతీయం సత్యవాణి స్వాగతం తెలిపారు. త్వరలో 10 కోట్లతో సిద్దిపేట కోమటి చెరువు బైపాస్ రోడ్డు వైపు టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేటలో అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. అన్నమయ్య సంకీర్తనలను విస్తృతం చేస్తున్నారన్నారు. సిద్దిపేటలో పుట్టి శోభా రాజు శిష్యుడిగా ఎంతో ఎదుగుతున్నాడని సిద్దిపేట పేరును నిలబెట్టుతున్నాడన్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.