Ugadi Celebrations | సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆయా మండలాలు, గ్రామాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద శంకరం పేట, మాసాయిపేట, వెల్దుర్తి, రామాయం పేట మండలాల పరిధిలో గృహాలలో పచ్చడి సేవించి ఒకరికొకరు పచ్చడి వితరణ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పెద్దశంకరంపేట, మార్చి 30 : పెద్ద శంకరంపేటలో ఉగాది పండుగను ప్రజలు శడ్రుచులతో ఆనందోత్సవాల మధ్య ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామాలయం, మండలపరిధిలోని కమలాపురం హనుమాన్ఆలయంతో పాటు ఆయా గ్రామాల్లో వేద బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. గృహాల్లో పచ్చడి సేవించి ఒకరికొకరు పచ్చడి వితరణ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక రామాలయలంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయాల్లో పంచాంగ శ్రవణం..
వెల్దుర్తి, మార్చ్ 30: తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుల వేడుకలను వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతోపాటు మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు ఇండ్లకు మామిడి తోరణాలతో అలంకరించి, పండుగ ప్రత్యేక వంటకాలైన భక్ష్యాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, పిండి వంటలు చేసుకొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.
అలాగే మామిడి తోరణాలు, రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి చేసి భక్తులకు పంపిణీ చేశారు. గ్రామాలలోని గ్రామచావిడి వద్ద దేవాలయాల్లో వేదపండితులు పంచాంగ శ్రవణం చేయగా గ్రామస్తులు పాల్గొని పంచాంగ శ్రవణాన్ని విన్నారు.
గ్రామాల్లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు..
రామాయంపేట రూరల్, మార్చి 30 : రామాయంపేట మండలం వ్యాప్తంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆయా దేవాలయాల వద్ద వేద పండితులు, పూజారులు చెప్పిన పంచాంగాన్ని శ్రద్దగా విన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్