get together | కొమురవెల్లి, మే 30 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తాము చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించడంతో పాటు మెమోంటోలు బహుకరించారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పూర్వవిద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభన్‌బాబు, లక్ష్మారెడ్డి, హైమాన్, తిరుపతయ్య, మల్లారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రాములు, రంగనాథ్‌తో పాటు పూర్వ విద్యార్థులు కొండ శ్రీధర్, లింగంపల్లి కనకరాజు, సిలివేరు మల్లేశం, కొంక మహేశ్, కవిత, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.