సిద్దిపేట,మే23 : జిల్లాలో అయిల్ పామ్ సాగులో నిర్ధేశిత లక్ష్యాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శ్రుకవారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫాం సాగును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాకు ఇచ్చిన 6500 ఎకరాల లక్షాన్ని తప్పనిసరిగా పూర్తి చేయలన్నారు.
రూ.300 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఆయిల్ పామ్ కర్మాగారం అతి త్వరలో పూర్తి అవుతుందన్నారు. క్ష్రేత స్థాయులో అధికారులు రైతుల ఇంటికి వెళ్ళి ఆయిల్ పామ్ వల్ల కలిగే లాభాల గురించి తెలిపి ప్రేరణ కల్పించాలన్నారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్ పామ్ వైపు మళ్లించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులు అందరు సమన్వయంతో వంద శాతం పూర్తి లక్ష్యాన్ని చేరేవిధంగా పని చేయాలని అదికారులను ఆదేశించారు.