సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలంలోని కుందన్ గ్రానైట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని కుకునూరు శివార్లలోని కుందన్ గ్రానైట్‌లో ఉన్న వంటగదిలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.