FDC Chariman | గొర్రెల పంపిణీతో గొల్లకుర్మలకు జీవనోపాధి : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
FDC Chariman | గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి (Pratap Reddy) అన్నారు.
జగదేవ్‌పూర్ (సిద్దిపేట) : గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి (Pratap Reddy) అన్నారు. గురువారం మండలంలోని వట్టిపల్లి గ్రామంలో రెండవ విడుత గొర్రెల పంపిణీ (Sheep Units)లో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ (Subcidy) ద్వారా గొర్రెల పంపిణీ చేయడం ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని అన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్(CM KCR) కుల వృత్తులను ప్రోత్సాహిస్తు పేద ప్రజలకు అండగా ఉంటున్నారని వెల్లడించారు.
ఎంతో మంది నిరుపేదలు పెట్టుబడి, పని లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి వృత్తిపరంగా చేయూతను అందిస్తు అండగా ఉంటున్నారని తెలిపారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, కుల వృత్తులకు బీసీ బంధు(BC Bandu), దళితులకు దళితబంధు(Dalit Bandu) వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

