జీతం లెక్క ఆయిల్‌పామ్ ఆదాయం
రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌లోని ఆయిల్‌పామ్ నర్సరీని క్షేత్రస్థాయిలో మంత్రులు సందర్శించారు.
- రైతులు వ్యవసాయ సాగులో మార్పులు సాధించాలి
- మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి
- చంద్లాపూర్‌లో ఆయిల్‌పామ్ నర్సరీని సందర్శించిన మంత్రులు
చిన్నకోడూరు, డిసెంబర్ 30 : రైతులు ఆయిల్‌పామ్ సాగుచేస్తే నెలనెలా జీతం లెక్క ఆదాయం వస్తుందని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌లోని ఆయిల్‌పామ్ నర్సరీని క్షేత్రస్థాయిలో మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరంలో 24 సార్లు పంట చేతికి వస్తుందని, భవిష్యత్ ఉన్న పంట ఆయిల్‌పామ్ అని మంత్రులు అన్నారు. లక్ష కోట్ల రూపాయల ఆయిల్‌పామ్‌ను విదేశాల నుంచి ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. నెలకు రూ.30వేల ఆదాయం కలిగిన ఆయిల్‌పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమన్నారు. జిల్లాలో 10వేల ఎకరాల సాగుకు ఆయిల్‌పామ్ మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా పెద్ద రైతులకు అవగాహన కల్పించి ఆయిల్‌పామ్ సాగుకు చైతన్యం కల్పించాలని వ్యవసాయ అనుబంధశాఖ అధికారులను మం త్రులు ఆదేశించారు.
ఆయిల్‌పామ్ మంచి లాభదాయకమైన పంట అన్నారు. 30 నుంచి 40 దశాబ్దాల కాలం వరకు రైతులు, ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా సేవ చేసిన వారు అవుతారని అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రులు కోరారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 3 వేలు, ఈ ఏడాది 3 వేలు ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతున్నదని, మరో 2, 3 నెలల్లో మరో 4 వేల ఎకరాల్లో నాటుతామని తెలిపారు.10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ లక్ష్యంగా ఆయిల్‌పామ్‌పై దృష్టిసారించినట్లు మంత్రులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ వనితారవీందర్రెడ్డి, రైతు సమన్వయ మండల సభ్యుడు అబ్బిరెడ్డి, సర్పంచులు ఎల్లయ్య, జయవర్ధన్‌రెడ్డి, స్వరూప, ఎల్లాగౌడ్, చంద్రకళ, రవిగౌడ్, అనిత, బాలయ్య, ఎంపీటీసీలు దుర్గారెడ్డి, జమున, ఎల్లయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగం, పోచ య్య, సుధాకర్, దేవయ్య, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

