Power cuts | కరెంటు కోసం రైతుల కన్నెర్ర.. మరుమాములలో సబ్ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు.
మద్దూరు (ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు.
ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు.
రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడీఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

