Fertilizers | జగదేవ్పూర్, జూలై 16 : గుళికల రూపంలో ఉండే యూరియా, డీఏపీల కంటే నానో టెక్నాలజీతో తయారు చేసిన ద్రవరూప ఎరువులను ఉపయోగించడం వలన రైతులకు మేలు కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి వసంతరావు అన్నారు. జగదేవ్పూర్ మండలంలోని అలిరాజ్పేట గ్రామ రైతులకు నానో యూరియా డీఏపీ వలన కలిగే ప్రయోజనాలపై ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ఎక్కువ మోతాదులో ఎరువులు వస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అపోహతో రైతులు మితిమీరిన ఎరువుల వాడకం చేస్తున్నారని తద్వారా పెట్టుబడుల భారం పెరిగి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. అలా కాకుండా నానో టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన ద్రవరూప ఎరువులను ఉపయోగించడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు.
నానో ఎరువులను పంటలపై పిచికాని చేయడంతో పోషకాలు నేరుగా ఆకుల ద్వారా అందించి అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో ప్రతినిధులు ఈశ్వర్రెడ్డి, ఏఈవోలు ఖలీల్, సాయిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం