Farmers | రాయపోల్, ఆగస్టు 18 : ఓ వైపు విస్తారంగా వర్షాలు కురుస్తుంటే అన్నదాతకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. ఏ కేంద్రానికి లారీ లోడ్ వచ్చిందని తెలిసినా అక్కడికి రైతులు పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసిన యూరియా దొరకకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి దౌల్తాబాద్. రాయపోల్ మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రెండు బస్తాల యూరియా కోసం రైతులు గంటల తరబడి షాపుల వద్ద వర్షంలో నిల్చున్నారు. అయినా యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు. మూడు రోజులు సెలవులు ఉండటం వలన యూరియా అందుబాటులో లేకపోవడం వలన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు మండల కేంద్రానికి వచ్చి వర్షంలోనే క్యూలైన్ కట్టారు. ఎంత ఎదురుచూసినా యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహంతో, అసహనంతో వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.
అయినా కానీ వ్యవసాయ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని.. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఎందుకు ఇస్తలేరని పలు గ్రామాల రైతులు ప్రశ్నించారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు యూరియా విక్రయించిన షాపుల వద్ద ఉండి టోకెన్లు ఇవ్వాలని పలు గ్రామాలు రైతులు పేర్కొంటున్నారు.
Kodangal | అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడుబండిలో తరలించిన పోలీసులు.. సీఎం ఇలాకాలో అమానవీయం
Tadipatri | జేసీ ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డిని అడ్డుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Thorrur | యూరియా కోసం రైతుల బారులు.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైన కష్టాలు