Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట – భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. వానాకాలం పంట సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
శనివారం పొలంలో ఎల్లయ్య వరి కొయ్యలను తగబెడుతుండగా పొగ, మంటలు చుట్టుముట్టడంతో ఆయనకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో కిందపడిపోయిన ఎల్లయ్యకు మంటలంటుకున్నాయి. మంటల కారణంగా తీవ్రగాయాలు కావడంతో ఎల్లయ్య మృతి చెందాడు.