Erravelli Survey | ఎర్రవెల్లి ఎట్లుండే తెల్వదా సార్.. సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారితో రైతు వాగ్వాదం.. వీడియో
Erravelli Survey | భూములు మావి ఎక్కడికి పోలేదు.. మంచిగనే ఉన్నయ్ సార్.. ఇంతకుముందు ఎర్రవెల్లి ఎట్లుండే.. ఇక్కడ పంటలు పండించుకొని బతికేటోడు ఎవడు వీళ్లకు తెల్వదా అని ఎర్రవెల్లిలో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారిని ఓ రైతు ప్రశ్నించాడు.
Erravelli Survey | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని వారిని నిలదీశారు.
ఎందుకొచ్చారని రైతులు అడిగితే.. ఈ ల్యాండ్‌లో 388 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది.. ఈ భూమి ఎక్కడి నుంచి ఎక్కడివరకుందనేది సర్వే చేయమని కలెక్టర్ ఆదేశించారని రెవెన్యూ అధికారి చెప్పగా.. ఇంతకు ముందు ఎన్నిసార్లు చేసిర్రు. సార్ ఉన్నప్పుడు నాలుగు సార్లు చేసిర్రు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎందుకు సర్వే చేస్తున్నరు అక్కడే ఉన్న ఓ రైతు ప్రశ్నించారు. సర్వే నంబర్లో మన భూమి ఉందా లేదా.. అనేది చూస్తున్నం.. అవన్నీ తర్వాత చెప్తమని సదరు అధికారి సమాధానం చెప్పడాన్ని దాటవేస్తుంటే.. అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించనట్టుగా చేస్తున్నరా.. మరి దేనికోసం చేస్తున్నరని మాకు డౌట్ ఉంటది కదా అని రైతు అడిగారు.
325 సర్వే నంబర్లో మీకేమైనా సమస్య వచ్చిందా..? వేరేవాళ్లు ఎవరైనా వచ్చి కబ్జా చేసిర్రా.. చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పంపియగానే వచ్చి నువ్వు సర్వే చేస్తవా..? నిన్న మొన్న లేనిది ఈ రోజు ఎందుకు చేస్తున్నవ్ నువ్.. 325 ఎక్కడకు పోలేదు.. ఇక్కడే ఉంది.. మీరెలాంటి సర్వే చేసేందుకు అధికారం లేదు సార్.. భూములు మావి ఎక్కడికి పోలేదు.. మంచిగనే ఉన్నయ్ సార్.. ఇంతకుముందు ఎర్రవెల్లి ఎట్లుండే.. ఇక్కడ పంటలు పండించుకొని బతికేటోడు ఎవడు వీళ్లకు తెల్వదా అని ప్రశ్నించాడు.
కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి 1 కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు
వారిని అడ్డుకున్న స్థానిక రైతులు
మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని నిలదీసిన స్థానిక రైతులు pic.twitter.com/ctIlxD3181
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
Read Also ;
Ind vs US | రష్యా చమురు కొనవద్దని అమెరికా అల్టిమేటం.. తీవ్రంగా స్పందించిన భారత్..!
KTR | 25 ఏండ్ల కింద ఇచ్చిన తోట ఆగయ్య భూమిని రేవంత్ రెడ్డి గుంజుకున్నడు : కేటీఆర్
Sircilla| అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

