– కరకగూడెం మండలంలో ఇసుక లారీలు, టిప్పర్లతో ప్రమాదాలు
– పట్టించుకోని అధికారులు
కరకగూడెం, సెప్టెంబర్ 17 : కరకగూడెం మండలంలో వాహనాలు అతివేగం, అధిక లోడుతో ఇష్టారాజ్యంగా దూసుకుపోతుండడంతో ఏజెన్సీ ప్రజలు నానా అవస్థలు పడుతూ ప్రమాదాల భారిన పడుతున్నారు. పలుచోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇసుక లారీలు వందల కొద్ది ప్రదాన రహదారి మీద నుండి అతివేగంగా వెళ్తుండడంతో మండల ప్రజలు, వాహనాదారులు భయం గుపిట్లో గడుపుతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వాహనాల్లో ఇసుక అధిక లోడుతో వెళ్తుడడంతో ఆధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. స్థానికులు, వాహనదారులు ఎవరికి ఫిర్యాదు చేసిన పట్టంచుకునేవారు లేకపోవడంతో లారీలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి.
మండలంలోని అల్లేరుగూడెం- అనంతారం ప్రధాన రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో గుంతలు భయంకరంగా ఏర్పడ్డాయి. మోతే, పద్మాపురంతో పాటు తదితర ప్రాధాన రహదారి గ్రామాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నిత్యం వందలాది భారీ వాహనాలు ఓవర్ లోడ్‌తో రాకాపోకలు సాగిస్తున్నాయి. ఓవర్ లోడ్ కారణంగా నూతనంగా వేసిన రహదారులు సైతo పగుళ్లు తేలుతున్నాయి. పరిమితికి మించి ఇసుకతో గ్రామీణ రహదారుల గుండా లారీలు వెళ్తుండటంతో స్థానిక ప్రజలు దుమ్ము, ధూళీతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ధ్వంసమైన రహదారులకు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నితి కూడా చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఓవర్ లోడుతో వేగంగా ప్రమాదకరంగా వెళ్తున్నవాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఓవర్ లోడుతో రోడ్లు ధ్వంసం
ములుగు జిల్లా తాడ్వాయి మీదుగా భారీగా ఇసుక లారీలు కరకగూడెం ప్రధాన రహదారి మీదుగా వెళ్తుండడంతో దుమ్ము, ధూళితో పాటు రూ.కోట్ల నిధులతో నిర్మించిన రహదారులు పూర్తిగా నాశనముతున్నాయి. ఎక్కడ చూసిన రహదారులపై భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. దీంతో రహదారిపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ రోడ్లతో రైతులు, విద్యార్ధులు, వృద్ధులు, గర్భీణులు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధ్వంసమైన రహదారులను మరమ్మతులు చేపట్టి భారీ వాహన రాకపోకలపై చర్యలు చేపట్టాలి.

ఓవర్ లోడుతో రోడ్లు ధ్వంసం