Harish Rao | ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో స్వయంగా తన ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా.. ఇప్పుడు మళ్లీ కొత్తగా అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదని ఎవరూ అపోహ పడవద్దు. గతంలో మీరు ఓటు వేసినా సరే, ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇస్తేనే మీ ఓటు హక్కు జాబితాలో భద్రంగా ఉంటుంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క పౌరుడు విధిగా భాగస్వామ్యం కావాలి.
ప్రజలందరూ తమ ఇళ్ల వద్దకు వచ్చే బీఎల్ఓ, బీఎల్ఏలకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి, ఈ నెల 24వ తేదీలోగా సంబంధిత అధికారులకు అందజేయాలని హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే @BRSHarish గారు పిలుపునిచ్చారు.
గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటరు… pic.twitter.com/h5jI2P7eH3
— Office of Harish Rao (@HarishRaoOffice) July 9, 2026